తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > ICC world cup 2023 > 1999 నుండి 2019 వరకూ క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర
Share

1999 నుండి 2019 వరకూ క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర (Cricket World Cup History) : వన్డే ప్రపంచ కప్ అంటే ప్రతి ఒక్కరికీ ఎక్కడ లేని ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. మీరు ఇప్పుడు మేం రాసే కథనం ద్వారా 1999 నుండి 2019 వరకు ఉన్న ఆరు ప్రపంచ కప్స్ విజేతల వివరాలు తెలుసుకుందాం.

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర – ముఖ్య వివరాలు

  1. 1970 నుంచి 1980 మధ్య ఉన్న దశాబ్ద కాలంలో వెస్టిండీస్ టీం ఉత్తమంగా నిలిచింది. మొదటి రెండు వరల్డ్ కప్స్ విండీస్ జట్టు గెల్చుకుంది.
  2. ఈ మొత్తం వరల్డ్ కప్స్ 12 ఉంటే, అందులో కేవలం ఆస్ట్రేలియా టీం మాత్రమే 5 సార్లు కప్ గెల్చుకున్నారు. మూడు సార్లు వరుసగా వరల్డ్ కప్స్ గెల్చుకుని రికార్డు సృష్టించారు.
  3. ఇండియా 2 సార్లు వరల్డ్ కప్స్ గెల్చుకుని టాప్ 3 లిస్టులో ఉంది. 
  4. అలాగే, పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు కూడా ఒక్కో సారి గెల్చుకుని వారి పేరు లిఖించుకున్నాయి.
  5. ఈ విధంగా పైన చెప్పిన దేశాలు తమ ఉత్తమ ప్రదర్శనలతో వరల్డ్ కప్ చరిత్రలో ఉత్తమ జట్లుగా నిలిచాయి.

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర – ఆస్ట్రేలియా దేశం – 1999

  • 1999 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో వారి ఆధిపత్యానికి పునాది వేయడం జరిగింది.
  • పాకిస్థాన్‌ జట్టును 132 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ జట్టు, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ విధ్వంసకర హాఫ్ సెంచరీ సాధించాడు.
  • ఆస్ట్రేలియా జట్టు 20.1 ఓవర్లలోనే లక్ష్యం పూర్తి చేసి రికార్డు సృష్టించింది. పాకిస్తాన్ జట్టు మీద 8 వికెట్ల తేడాతో గెలిచింది.
  • ఇందులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చూపించడమే కాకుండా, క్రికెట్‌ వరల్డ్ కప్‌లో వారి అద్భుతమైన విజయాలకు పునాది వేయడం జరిగింది.

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర – ఆస్ట్రేలియా దేశం – 2003

2003 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశం పూర్తి ఫాంలో ఉన్నప్పుడు వరల్డ్ కప్‌లో కూడా ఉత్తమంగా ఆడింది. ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ అద్బుత సెంచరీ (141) మరియు డామియన్ మార్టిన్ 88 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ టీం 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా జట్టుకు నిర్దేశించింది. భారత బ్యాట్స్ మెన్లు కూడా ఆస్ట్రేలియా జట్టు మీద అలుపెరగని పోరాటం చేశారు. అయితే 40 ఓవర్లలో 234 పరుగులు చేసినా, ఆసీస్ బౌలర్ల ధాటికి ఆలౌట్ అయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 125 పరుగులతో గెలిచి ప్రపంచ విజేతగా నిలిచింది.

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర – ఆస్ట్రేలియా దేశం – 2007

2007 ప్రపంచ కప్ గెల్చుకున్న ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు వరల్డ్ కప్స్ గెల్చిన మొట్ట మొదటి దేశంగా రికార్డు లిఖించుకుంది. ఫైనల్‌ మ్యాచులో ఆడమ్ గిల్‌క్రిస్ట్ (149) సెంచరీ చేయగా, ఆస్ట్రేలియా 281 లక్ష్యం శ్రీలంకకు పెట్టింది. శ్రీలంక కూడా ఉత్తమ బ్యాటింగ్ చేసినా కూడా, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా 53 పరుగుల తేడాతో ఆసీస్ గెల్చింది.

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర – భారతదేశం – 2011

2011లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ మర్చిపోలేని విజయాన్ని ప్రజలకు అందించింది. మహేల జయవర్ధనే సెంచరీ చేసి (103) శ్రీలంక 275 పరుగులు చేసింది. భారత జట్టులో గౌతమ్ గంభీర్ (97), ధోని (91*) అద్బుతంగా ఆడారు. ధోని చివరి బంతికి సిక్స్ కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ అందించిన తీరు చారిత్రాత్మకం.

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర – ఆస్ట్రేలియా దేశం – 2015

2015 వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌ జట్టును ఓడించేసి 5వ సారి ప్రపంచ విజేతలుగా నిలిచారు. 4 సార్లు వరల్డ్ విజేత అయిన ఆస్ట్రేలియా టీం, న్యూజిలాండ్‌ జట్టును 183 పరుగులకు కట్టడి చేసింది. చివరి వన్డే ఆడిన మైఖేల్ క్లార్క్ 74 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచి 5వ సారి వరల్డ్ కప్ పొందింది.

క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర – ఇంగ్లాండ్ దేశం – 2019

2019 వరల్డ్ కప్‌ ఫైనల్ చాలా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్లు 241 రన్స్ చేయగా, ఫలితంగా సూపర్ ఓవర్ వేశారు. అయితే, అది కూడా టై అయింది. ఐసిసి నియమాలు అయిన బౌండరీ కౌంట్ ప్రకారం, ఇంగ్లాండ్ విజేత అయింది. ఈ నియమాలు న్యూజిలాండ్ జట్టును నిరాశకు గురి చేశాయి.

మీరు క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర (Cricket World Cup History) సమచారం ఈ కథనం ద్వారా తెలుసుకున్నారు కదా! ఇలాంటి క్రికెట్ వార్తల కోసం ప్రముఖ బ్లాగ్ Fun88 (ఫన్88) సందర్శించండి.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: